Saturday, May 3, 2025
- Advertisement -

ఏం మాయ చేశావే..జీవితాంతం గుర్తుండిపోతుంది!

- Advertisement -

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. 15 సంవత్సరాల సినిమా కెరీర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సమంత ఇటీవలె హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును సైతం అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తెలుగులో ఏం మాయ చేశావో సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది .ఈ చిత్రంలో ఆమె అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి సన్నివేశం ఇప్పటికీ తన మదిలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా నిలిచిపోయిందని వెల్లడించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో కార్తీక్-జెస్సీ తొలిసారి కలిసే సన్నివేశం తనకు ఎంతో ప్రత్యేకమైనదని గుర్తు చేసుకుంది. అలాగే, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పని చేయడం అద్భుతమైన అనుభవమని, అది జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. తెలుగులో ఎన్టీఆర్, మహేశ్ బాబు,నాని,నితిన్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో నటించింది సమంత. తెలుగులో సమంత నటించిన చివరి చిత్రం ఖుషి.

అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత. ఆ తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -