Monday, May 5, 2025
- Advertisement -

‘సరైనోడు’ స్పెషల్ ట్రీట్ రేపు ఇవ్వనున్నాడు!

- Advertisement -

అల్లు అర్జున్, రకుల్, క్యాథరిన్ జంటగా నటిస్తున్న చిత్రం సరైనోడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇంతకు ముందు తమన్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఇటివలే ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‍లో తెగ హల్ చల చేస్తుంది. ఐతే ఈ చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో వచ్చిన పాట ని పూర్తి గా రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఈ చిత్రమేకర్స్ ఈ పాట ని రేపు రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ మరియు ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ చిత్రం నిర్మించబడుతుంది. పూల్ లెన్త్ మాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కొత్తగా కనిపించనున్నాడు. ఈ సమ్మర్‍లో బన్నీ అభిమానులకు పండగే అంటున్నారు చిత్ర యూనిట్. వచ్చే నెల 22 న ఈ చిత్రాన్ని రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -