సిని పరిశ్రమలో హీరోలు వారి సినిమాలకు సెంటిమెంట్స్ చాలా నమ్ముతారు. ఒక్కసారి సెంటిమెంట్ వర్క్అవుట్ అయిందంటే ఇక ఆ సెంట్మెంటునే అనుసరిస్తారు. సెంటిమెంట్ విషయంలో పవన్ నమ్ముతాడో లెదో కాని అతని సినిమాలు మాత్రం ఆ సెంటిమెంట్‍ని అనుసరిస్తున్నాయి.
బద్రి , ఖుషి , జల్సా, గబ్బర్ సింగ్ సమ్మర్‍లో రిలీజ్ అయ్యి అన్ని పెద్ద హిట్ అయినవే. అయితే ప్రస్తుతం పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కూడా సమ్మర్ 2016 మే 11 కి రిలీజ్ చేయాలి అని చూస్తున్నారు. పవన్ పాత సినిమాలో వర్క్‌అవుట్ అయిన సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారు అభిమానులు.
గత సినిమా గబ్బర్ సింగ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఓ సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాత. ఈ మూవీతో తొలిసారి పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంక రాయ్ లక్ష్మి, సంజన నటిస్తున్నా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.