పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి బిజినేస్ తో పాటు భారీగా అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ సినిమాని ఏప్రియల్ 8న రిలీజ్ చేయడానికి సర్థార్ టీం రాత్రింబవల్లూ కష్టపడుతుంది. అయితే ఇది పవన్ పులు స్వారీ అంటున్నారు ట్రేడ్ పండితులు.
అసలు పవన్ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో , ట్రేడ్ లో, సినీ లవర్స్ లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. దానికి తోడు ఈ సినిమా పోస్టర్స్, ప్రోమోల్లో..పవన్ గుర్రం మీద కనపడుతూ కనపడగానే, ఆ స్టైల్ కు ముగ్దులైపోయి ఆ ఎక్సపెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.
దానికి తోడు పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ కు ప్రాఛైజీ చిత్రం కూడా సినిమా ప్రారంభం నుంచి అందరి దృష్టీ పడేలా చేసింది. అదే ఇప్పుడు సమస్య అంటున్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 85-90 కోట్లు వరకూ జరిగిందని సమాచారం. ఇంకే హ్యాపీ అంటారా..అక్కడే ఉంది లాజిక్. పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.