- Advertisement -
సీనియర్ నటుడు శరత్ కుమార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీలో పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు శరత్ కుమార్. ఇది సిద్దార్థ్ కెరీర్‌లో 40వ సినిమా కాగా ‘8 తొట్టక్కల్’ ఫేం శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
శరత్ కుమార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఈ సినిమాతో పాటు విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్పలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు శరత్ కుమార్. ఈ సినిమాలో నాథనాధుడిగా శరత్ కుమార్ కనిపించనుండగా తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శరత్ కుమార్ ఉగ్రరూపాన్ని చూపెట్టారు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.