Wednesday, May 7, 2025
- Advertisement -

సర్దార్.. చప్పుడు లేదేమి?

- Advertisement -

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ఏడాది సంక్రాంతికే రిలీజవుతుందనుకున్నారు. కానీ కొన్ని కారణల వల్ల  సంక్రాంతి రేసులోంచి తప్పుకుంది. తర్వాత మార్చిలోనే సినిమా రిలీజ్ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 8 అంటూ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు.

ప్రస్తుతానికి ఈ డేటుకే ఫిక్సయి ఉన్నారు అభిమానులు. ఐతే ఈ సినిమా ఏప్రిల్ నుంచి మేకి వాయిదా పడిందని కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. అయితే  అదేమీ లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఏప్రిల్ 8నే విడుదల చేస్తామని చెప్పుతున్నారు. ఇప్పుడు మార్చి తొలి వారం ముగిసిపోతుంది. మహా అంటే సినిమా విడుదలకు నెల రోజులే సమయం ఉంది.

కానీ ‘సర్దార్..” స్టేటస్ ఏంటన్నదే తెలియడం లేదు. ఇంక ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కాంప్లీట్ కాలేదు. అలాగే ఆడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్పాలేదు. సో ఏప్రిల్ 8న సర్దార్ చిత్రం రిలీజ్ అవ్వడం సందేహమే అన్నట్లుంది. పవన్ అభిమానులు మాత్రం  చెప్పిన డేటుకే సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -