Saturday, May 3, 2025
- Advertisement -

ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!

- Advertisement -

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమాతో చిత్రసీమకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిరమాలతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత అందరూ అగ్రహీరోలతోనూ ఆడిపాడింది ఈ భామ.

శ్రీలీల అంటే నటనే కాదు డ్యాన్స్‌ కు కేరాఫ్. సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు సైతం శ్రీలీల డ్యాన్స్‌ కు ఫిదా అయ్యారంటే అర్ధం చేసుకోవచ్చు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా.. ఇటు పుష్ప 2లో దెబ్బలు పడతాయి అన్న అది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకే సాథ్యం. ‘ఆషికి 3’ అనే బాలీవుడ్ సినిమాలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటించే ఛాన్స్ లభించింది.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో శ్రీలీల,కార్తీక్ ఆర్యన్..ల మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం వారు డేటింగ్లో ఉన్నారనే వార్తలు కూడా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వీరు అధికారికంగా ప్రకటించింది లేదు.ఇప్పటికే చాలా సినిమా వేడుకల్లో, ఈవెంట్లలో కూడా వీరు కలిసి కనిపించారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ అటెండ్ అయిన ఓ ఈవెంట్లో కూడా శ్రీలీల తన కుటుంబంతో హాజరవ్వడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ జంట హాట్ కపుల్ గా పేరొందింది.

ఇక ‘ఆషికి 3’ తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల ఆ సినిమాతో..నార్త్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే తెలుగులో ప్రస్తుతం రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, అఖిల్ తో ‘లెనిన్’ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -