తెలుగుతో పాటు తమీళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో బాహుబలి సినిమా విజయం సొంతం చేసుకుంది. బాహుబలి సినిమాలో నటించన వారికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తోచేది రాజమౌళి.
బాహుబలి సినిమాని తెరకేక్కించినందుకుగాను రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. బాహుబలి సినిమా కూడా అదే రేంజ్‍లో వసలు సాధించి రికార్డ్ సృష్టించింది. ఐతే బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడిలో కలిగే మొదటి ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని.
ఈ ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ ప్రశ్నగా మారింది. ఐతే ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే బాహుబలి 2 వచ్చే వరకు ఆగాల్సిందే. కానీ ఈ మధ్య ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే ప్రశ్నపై ఓ చిన్న క్లారిటీ ఇచ్చాడు.
ఐతే బాహుబలి సినిమాలో కట్టప్పది చాలా కీలకమైన పాత్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపడు అనే ప్రశ్నకు సింగిల్ లైన్‍లో చేప్పలేం దానికి ఈ పెద్ద స్టోరీ ఉందని అలాగే బాహుబలి సినిమా కథ మొత్తం కట్టప్ప ద్రోహం మీదే తిరుగుతుందని రాజమౌళి తెలిపాడు. ప్రస్తుతం రాజమౌళి, ప్రభాస్‍లు బాహుబలి 2 షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా ఓ రేంజ్‍లో హిట్ అవ్వడంతో బాహుబలి 2 పై మరింత అంచనాలు భారీగా పెరిగిపోయాయి.