Monday, May 5, 2025
- Advertisement -

త‌మ‌న్నా క్వీన్ సినిమా ఆగిందా?

- Advertisement -

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన క్వీన్ సినిమాను తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ భాష‌ల‌లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.బాలీవుడ్ క్వీన్‌లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకుగాను కంగనా రనౌత్ న‌ట‌న‌కు జాతీయ అవార్డు వ‌చ్చింది.హిందీలో కంగనా పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్‌, తమిళంలో కాజల్‌, కన్నడలో పరుల్‌యాదవ్‌లు పోషిస్తున్నారు.

తెలుగులో నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం తెలుగు వెర్షన్‌ షూటింగ్‌ ప్రస్తుతం ఆగిందని టాలీవుడ్‌ సమాచారం.నీలకంఠకు తమన్నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటున్నారు. అందుకే సినిమా ఆగింది అని స‌మాచారం.అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -