Monday, May 5, 2025
- Advertisement -

పవన్-చరణ్ సినిమాకి దర్శకుడు ఎవరంటే?

- Advertisement -

కొత్త కథనంతో సినిమాలు తెరకేక్కించడంలో సుకుమార్ ఎప్పుడు మూందు ఉంటాడు. ఒక్కసారైన సుక్కుతో సినిమా చేయాలి అని ఆశ అందరి హీరోలకు ఉంటుంది. ఐతే తాజాగా సుకుమార్‍తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయడానికి చూస్తున్నాడట. నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయం సాధించడం అందులోను రామ్ చరణ్ ఈ సినిమా చూసి ప్రశంసలు ఇవ్వడం కూడా జరిగింది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‍లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కథ చర్చలు కూడా జరుగుతున్నాయట. రీసెంట్‍గా సుక్కు చెర్రికి ఓ లైన్ కూడా చెప్పాడట. ఈ లైన్ కూడా చరణ్‍కి కూడా నచ్చిందట. ఐతే కొద్ది రోజులుగా పవన్ బేనర్‍లో చరణ్ ఓ సినిమా చేస్తాడు అనే వార్తలు అప్పట్లో వచ్చిన విషయం తెలిసిందే.

తాజా సుక్కుతో చేయబోయే సినిమాని పవన్ బేనర్‍లోనే నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నాడు. ఈ సినిమాలో విలన్‍గా అరవింద్‌ స్వామి నటిస్తుండగా అల్లు అరవింద్‌, ఎన్‌ వి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -