Monday, May 5, 2025
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్

- Advertisement -

రామ్ చరణ్… సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తని ఒరవన్ చిత్రం చేస్తున్నారు. ధృవ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తనను బ్రూస్ లీ ప్లాఫ్ నుంచి బయిట పడేస్తుందని భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఇందు కోసం సుకుమార్  యుఎస్ లోనే లొకేషన్స్ లోనే తిరుగుతూ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

రిసెంట్‍గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ వసులు చేసింది. సో ఈ నేఫధ్యంలో సుకుమార్ తన తదుపరి సినిమాని రామ్ చరణ్‍తో చేయ్యాలని అనుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ ని చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్‍లకు చెప్పాడట సుక్కు.

స్టోరీ లైన్ విన్న ఈ ముగ్గురు వేంటనే ఒకే అన్నారట. సినిమా కథ యుఎస్ లో జరుగుతుందని, అందుకుని అక్కడ రియల్ లొకేషన్స్ లో తిరిగుతూ స్క్రిప్టు రాసినట్లు ఉంటుంది. అలాగే బ్రేక్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుందని సుకుమార్ ఈ ట్రిప్ పెట్టాడంటున్నారు.  త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -