యానిమల్ తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఈ సినిమా రానుండగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్రగ్స్ నేపథ్యంలో ఈ కథ సాగనుండగా ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం.
ఈ సినిమా దసరా తర్వాత పట్టాలెక్కనుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. స్పిరిట్ సినిమా కోసం సందీప్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. సినిమాలో పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటా తీసుకోనున్నారని…ఈ విధంగా చూస్తే సందీప్ రెమ్యునరేషన్ రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌కు సైతం రెమ్యునరేషన్ రూపంలో షాకింగ్ అమౌంట్ అందనుందట.
యానిమల్ సూపర్ సక్సెస్ తో సందీప్ వంగా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక ఈ మూవీ 2025లో రిలీజ్ కానుండగా టీసిరీస్ తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ మూవీలో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారని మేకర్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి విడుదలకు సిద్ధంగా ఉంది.