Wednesday, May 7, 2025
- Advertisement -

ఫ్లాప్ డైరెక్టర్స్ తో టీం అప్ అవుతున్నారు!

- Advertisement -

సాదారణంగా హీరోస్ అంతాసక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తో వర్క్ చెయ్యడానికి ఇష్టపడుతుంటారు.కానీ, మెగా హీరోస్ అంతా ఫ్లాప్ డైరెక్టర్స్ తో టీం అప్ అవుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో రోపొందించేందుకు ఓకే చేసారు.

ఈ చిత్రానికి ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.వినాయక్ దర్సకత్వంలో అఖిల్ హీరో గా ‘అఖిల్’ చిత్రం పెద్ద డిసాస్టర్ ని అందుకుంది.అయినా చిరు అతనితో టీం అప్ అయ్యారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం టో పెద్ద డిసాస్టర్ ని ఎదుర్కున్నారు.

ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ ఎస్.జే.సూర్య దర్శకత్వంలో నటించేందుకు సిద్దమయ్యారు.సూర్య దర్సకత్వంలో రూపొంది౦చబడిన ‘పులి’ చిత్రం పెద్ద ఫ్లాప్ ని అందుకుంది.మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్సకత్వంలో ‘తాని ఓరువన్’ చిత్ర రీమేక్ లో నటిస్తున్నారు.సురేందర్ రెడ్డి కూడా ‘కిక్ 2′ చిత్రం తో పెద్ద ఫ్లాప్ ని ఎదుర్కున్నారు.సాయి ధరమ్ తేజ్ కూడా డైరెక్టర్ బివిఎస్ రవి తో ఒక చిత్రానికి ఓకే చేసారు.కానీ, ఆ డైరెక్టర్ కూడా పెద్ద ఫ్లాప్ ని అందుకొని ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -