హీరోయిన్ తమన్నాకు తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.బాహుబలి తరువాత అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.నేషనల్ లేవల్లో క్రేజ్ ఏర్పడింది.కాని సినిమాలలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఐటెం సాంగ్స్ చేస్తు బండిని లాగించేస్తుంది.ప్రస్తుతం ఆమె ‘క్వీన్’ రీమేక్‌లోను కల్యాణ్ రామ్ జోడీగా ‘నా నువ్వే’ సినిమా చేస్తోంది. ఇప్పడు తమన్నాకు సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘సైరా’ సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను తమన్నా అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. నయనతారతో పాటు మరో కథానాయిక పాత్ర కావొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. సినిమాలో హీరో చిరంజీవి లుక్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు చిత్ర యూనిట్.