Saturday, May 3, 2025
- Advertisement -

ఆ హీరోకి ప్రేమ లేఖ రాయడం రాదట..

- Advertisement -

అతను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడుతున్న హీరో.. ఆ యంగ్ హీరో ఒక హీరోయిన్ ని బాగా ఇష్టపడ్డాడు. హీరో చేసిన మూడు సినిమాలు హిట్ అవ్వటంతో సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టాడు. అలాగే కోరుకున్న అమ్మాయి కోసం తన మనసులోని మాటని తెలియ చేయాలని అనుకున్నాడట..

కానీ సినిమాలో హీరో లాగా తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేక పోయాడు.. మనోడి మనసులోని మాటను పేపర్ మీద పెట్టి ఆ హీరోయిన్ కి ఇద్దాం అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా ప్రేమలేఖను రాసి హీరో గారి సన్నిహితుడికి ఆ లేఖను చూపించాడు.. ఆ స్నేహితుడు అది ప్రేమలేఖ కాదు “పిచ్చి లేఖ” అని చెప్పటంతో తనకి ప్రేమ లేఖలు రాయటం రాదని నిర్ణయించుకున్నాడు.. తర్వాత ఒక మంచి ప్రేమ లేఖ కోసం ఒక కవిని కలిశాడట. ఆ కవి గారు రాసిన ప్రేమలేఖకు flat అయిన ఆ హీరో సంతోషంతో ఎగిరి గంతేసారు..

ఇప్పుడు ఆ హీరో ఆ ప్రేమ లేఖని హీరోయిన్ కి ఎలా ఇవ్వాలని సతమతమవుతున్నాడట.. ఇంత టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో కూడా మనోడు సంప్రదాయబద్దంగా వెళ్దామనుకుంటున్నాడట.. ఏది ఏమైనా అతని ప్రేమ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.. ఇంతకీ ఎవరా హీరో.. ఎవరా హీరోయిన్.. just think..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -