సన్ ఆఫ్ సత్య మూర్తి తరవాత స్టార్ హీరోలని పక్కన పెట్టి హీరో నితిన్ తో సినిమా తీసాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ తరం కుర్ర హీరోలతో ఇప్పటి వరకూ సినిమాలు తీయని త్రివిక్రమ్ ఈ సినిమా దెబ్బతో ఆ మోజు కూడా తీర్చుకోబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఈ నెల 14 న విడుదల కావాల్సి ఉంది కానీ త్రివిక్రమ్- అనిరుద్ ల మధ్యన కలిగిన ఇబ్బందుల కారణం కావచ్చూ మరేదైనా కావచ్చు గానీ సినిమా మాత్రం బాగా లేట్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం త్రివిక్రమ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘అ ఆ’ అంటూ వింత టైటిల్ పెట్టిన గురూజీ ఈ సినిమా ని ఏప్రిల్ 22 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైందని ఇప్పటికే 50వరకూ ఖర్చు చేశారని ఇంకా 30 శాతం షూటింగ్ పెండింగ్ పూర్తి చేసుకుని ట్రాక్ లో పెట్టె సరికి ఇంత సమయం పట్టింది.
అయితే ఈ సినిమా వచ్చే నెలలో నే పవన్ కళ్య ణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రానుంది. చెప్పడానికి ఏప్రిల్ 8 అంటున్నారు కానీ ఇంకొక వారం ఆలస్యం అయితే గనక త్రివిక్రమ్ – పవన్ ల సినిమాలకి కేవలం వారం గ్యాప్ ఉంటుంది. స్వతగాహా గా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వారిద్దరూ తమ సినిమాలు వాయిదా వేసుకుంటారా లేక ప్రొడ్యూసర్ లేక్ నిర్ణయం వదిలేస్తారా అనేది చూడాలి.