జనరేషన్ – జనరేషన్‌కు ఆలోచనల్లో తేడా వస్తుంది. ఇక గ్లామర్ ఇండస్ట్రీ సినీ పరిశ్రమలో మరి ఇది ఎక్కువ. అందం, చందంమే కాదు కాస్త లక్ కూడా ఉండాలి. అలా అయితేనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు రాణించగలం. అలా ఇండస్ట్రీకి వచ్చి తళుక్కుమన్న భామలు ఎంతో మంది. వారిలో కొంతమంది ఇండస్ట్రీని ఏలేశారు. అందుకే కాజల్, రకుల్,త్రిష లాంటి భామలెందరో సంవత్సరాల పాటు సినిమా అవకాశాలు దక్కించుకున్నారు.
అయితే తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు నిర్మాతలంతా ఆ ఇద్దరి భామల జపమే చేస్తున్నారు. ఇంతకీ వారెవరనుకున్నారా వారే రష్మికా మందన్నా, శ్రీలల. ఇప్పుడు వీరికి అవకాశాలు వద్దన్నా తలుపు కొడుతున్నాయి. పెళ్లి చూపులు సినిమాతో హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది శ్రీలల. అందుకే చిరంజీవి నుండి మొదలు పెడితే బాలకృష్ణ,నాగార్జున,రామ్ చరణ్, జూనియ్ ఎన్టీఆర్,ప్రభాస్, విజయ్ దేవర కొండ వరకు శ్రీలలనే ఫస్ట్ ప్రెఫర్ చేస్తున్నారు. ఇక ఆరంగేట్ర హీరోలైతే శ్రీలల డేట్స్ కోసం వేచిచూసే పరిస్థితి నెలకొంది. బాలకృష్ణతో శ్రీలల నటించిన భగవంత్ కేసరి ఇవాళ విడుదల కాగా పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకు. అలాగే శ్రీలల నటించిన ఆదికేశవ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్ బాబుతో గుంటూరు కారం , పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , నితిన్‌తో ఎక్ట్స్ ఆర్డినరీ మేన్ సినిమాలు కూడా చేస్తోంది.ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీలో శ్రీలలనే హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ నడుస్తోంది.
ఇక మరో భామ రష్మికా మందన్నా. క్యూట్ లుక్స్‌తో పాత్ర ఏదైనా ఒదిగిపోయే రష్మికా…ఒక్క టాలీవుడ్‌లోనే కాదు దక్షిణాది భాషల్లో మెప్పిస్తోంది. ప్రస్తుతం రష్మికా పుష్ప 2తో పలు సినిమాల్లో నటిస్తోంది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ ఇద్దరు భామల డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. మరి ఈ ఇద్దరి భామల టైం ఎన్ని రోజులు నడుస్తుందో వేచిచూడాలి..