టాలీవుడ్ ప్రముఖులు.. డ్రగ్స్ సంబంధించిన కేసు విషయంలో.. విచారణకు హాజరవుతున్నారు. ఈ విచారణలో అధికార్లు తమకు కావాల్సిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర మొదలైన ఈ విచారణ.. హీరో నవదీప్ వరకు వచ్చింది. పూరీ, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, మరో హీరో నవదీప్ లు ఇప్పటి వరకు పోలీసుల విచారణకు హాజరయ్యారు.
అయితే ముందే అనుకొని మరి చేశారో.. లేక యాధృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ.. ఇప్పటివరకు హాజరయిన అందరిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. అదేంటంటే.. ఈ నలుగురూ విచారణకు వైట్ షర్ట్ తోనే హాజరు కావటం విశేషం. అయితే పరిశ్రమలో సినీ ప్రముఖులు సెంటిమెంట్ ను ఫాలో అవుతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో విచారణకు వస్తూ కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి, పురోహితుల సూచనల మేరకు ముహూర్తాలు చూసుకుని ఇంటి నుండి బయటకు వస్తున్నారట.
అంతే కాదు వేసుకొని డ్రెసులు కూడా సెంటిమెంట్ ప్రకారమే వేసుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. ఇప్పటివరకు పూరి , శ్యాం కె నాయుడు , సుబ్బరాజు , తరుణ్ , నవదీప్ వీరంతా కూడా తెల్లచొక్కాలను ధరించుకొని విచారణకు వస్తున్నారు. మరి వీరు.. సెంటిమెంట్ వారిని ఎంత వరకు కాపడుతుందో చూడాలి.