పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2016 సర్దార్ గబ్బర్ సింగ్ పోయిన వారం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తోనూ 50 కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుంది. కాగా ఈ సినిమాతో పవన్ కి కథా రచయితగా ఎంత చెడ్డపేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.
వెంట్రుకంత స్టోరీని రెండేళ్ళు కష్టపడి రాసి మరో ఏడాది కాలం నిర్మాణంలో ఉంచాడు పవన్. కాగా ఇదంతా ఎందుకని జరిగింది అంటే అత్తారింటికి దారేది తరువాత తనతో సినిమా చేయడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడం వలెనే ఇది జరిగింది అని చెప్పిన పవన్ తన తదుపరి సినిమా తనకు ఖుషితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి పులితో ఇండస్ట్రీ డిసాస్టర్ ఇచ్చిన ఎస్.జే.సూర్యతో ఉండబోతుందని ఈ మధ్యనే కన్ఫాం చేశాడు.
కానీ అటు ఫ్యాన్స్ నుండి ఇటు సన్నిహితుల నుండి భారీ ప్రెజర్ వస్తుండటంతో ఇప్పుడు సూర్యని పక్కకి పెట్టేయాలని పవన్ భావిస్తున్నాడట. ఎలాగు తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ఇప్పుడు అ…ఆ సినిమాను పూర్తి చేశాడు కాబట్టి ఆయనతో సినిమా చేస్తే అంతా సెట్ అవుతుందని భావిస్తున్నాడట. ఫ్యాన్స్ కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నారు.