Sunday, May 4, 2025
- Advertisement -

NBK 109..వీర మాస్!

- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా NBK 109 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య రీసెంట్‌గా అఖండతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టగా బాబీ చిరుతో వాల్తేరు వీరయ్యతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

ఈ సినిమా తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బాలయ్య సరసన చాందిని చౌదరితో పాటు ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలె రిలీజ్ అయిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. బాలయ్య అభిమానులను ఉర్రూతలుగించేలా ఉంది టీజర్. ఇక NBK109 టైటిల్‌ కోసం అంతా ఎదురుచూస్తుండగా త్వరలో అఫిషియల్‌గా అనౌన్స్‌చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -