Friday, April 19, 2024
- Advertisement -

తండ్రి క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌నల్ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవ‌లే టాక్సీవాలాతో మ‌రో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం మ‌నోడు డియర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా గీతా గోవిందం బ్యూటీ ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సంబంధంచిన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా త‌రువాత పెళ్లైన కొత్త‌లో ఫేం క్రాంతి మాధ‌వ్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణిలో పని చేసే ఉద్యోగిగా కనిపించనున్నాడు. కార్మికులకు యూనియర్ లీడర్ గా విజయ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఈ సినిమాలో విజ‌య్ తండ్రిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఓ ఎనిమిదెళ్ల వ‌య‌స్సు గ‌ల పిల్లాడికి తండ్రిగా న‌టించాడ‌ట విజ‌య్ దేవ‌ర‌కొండ‌. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ అప్పుడే ఇలా తండ్రి క్యారెక్ట‌ర్స్‌లో న‌టించ‌డం ఏంట‌ని ఫ్యాన్స్ తెగ బాధ‌ప‌డిపోతున్నారు. కాక‌పోతే సినిమాలో పాత్ర ఆ విధాంగా ఉండ‌టంతో విజ‌య్ దేవ‌ర‌కొండ తండ్రి క్యారెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడట. ప్రేమకథా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, క్యాథ‌రిన్ వంటి హీరోయిన్లు కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -