పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే క్యూట్ హీరోయిన్ సమంతకు చాలా అభిమానం. పవన్ ను గురువు గారుగా సంబోధిస్తూ.. ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ పై.. సమంత తన అభిప్రాయాన్ని క్లియర్ చేసింది. అలాగే.. యంగ్ హీరో నితిన్ కు కూడా పవర్ స్టార్ అంటే ప్రాణం. ఈ ఇద్దరి అభిమానం … ఇప్పుడు ఆరాధనగా మారినట్టే కనిపిస్తోంది.
ఎందుకు అని అనుకుంటున్నారా? నితిన్ హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సమంత నటిస్తున్న అ..ఆ… సినిమా షూటింగ్ సెట్ లో.. నితిన్, సమంత తీరు చూసే.. ఈ విషయం వివరించాల్సి వస్తోంది.
సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్ లో.. ఓ గుర్రపు బొమ్మపై ఆడుకుంటూ పవన్ కనిపిస్తాడు. అలాగే.. నితిన్ కూడా గుర్రపు బొమ్మపై ఆడుకుంటుంటే.. సమంత అతని వెనకాలే ఉండి కో ఆపరేట్ చేస్తుంటుంది. అదే టైమ్ లో.. లవ్యూ పవర్ స్టార్ అంటూ.. ఇద్దరూ కలిసి చాలా క్యూట్ గా పవన్ పై లవ్ ఎక్స్ ప్రెస్ చేశారు.
5 సెకన్లే ఉన్న ఈ వీడియోను.. నితిన్ సోషల్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. చాలా మంది వీళ్లిద్దరి వ్యవహారాన్ని చూస్తూ.. ముచ్చట పడుతున్నారు.
{youtube}v=n6s4xt0ugtM{/youtube}