Tuesday, May 6, 2025
- Advertisement -

హరి హర వీరమల్లు పక్కన పెట్టిన పవన్..? ఎందుకు..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా కేటగిరీలో చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషీ ఫేమ్ ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

హరిహర వీరమల్లు నుంచి ఇప్పటికే వచ్చిన పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీగా రెస్పాన్స్ వచ్చింది. మొగలాయిల కాలంనాటి కథ ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఇక ఈ సినిమా పాన్​ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ విడుదల కాబోతున్నది. బాహుబలి తరహాలో ఈ సినిమా కోసం సెట్స్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. మొగలాయిల కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా ఈ సెట్స్ వేశారు. పీరియాడిక్ డ్రామాగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరపైకి వచ్చింది. హరిహర వీరమల్లును వచ్చే సంక్రాంతి సీజన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి.

అయితే పవన్ ఈ మూవీ కంప్లీట్ చేయకుండా ‘వినోదయ సిత్తం’తో పాటు ‘ఉస్తా్ద్ భగత్‌సింగ్’పై కాన్సంట్రేట్ చేశాడు. మరి దీని వెనకున్న కారణాలు విశ్లేషిస్తే.. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని, ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయిందనే రూమర్స్ నెట్టింట షికారు చేస్తున్నాయి. నిర్మాత ఏఎం రత్నం ఎలాగైనా ఈ మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -