- Advertisement -
సీనియర్ హీరో నాగర్జునకు చెందిన ఓ వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో పని చేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, పాపిరెడ్డిగూడ శివారులలో నాగర్జునకు కొంత వ్యవసాయ భుమి ఉంది. ఈ వ్యవసాయ భుమిలో తూర్పుగోదావరి జిల్లాకు వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ వైరును గమనించకపోవడంతో అది తగిలి విద్యుదాతానికి గురయ్యాడు. దుర్గ గమనించి భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. కాగా ఈ ప్రయత్నంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాద వార్త విన్న నాగర్జున హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారని తెలుస్తుంది.