Sunday, May 4, 2025
- Advertisement -

వారం రోజుల పాటు వర్షాలు!

- Advertisement -

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ అందించిన ఈ తీపి కబురుతో ప్రజలు కాస్త ఉపిరి పీల్చుకున్నారు.

రాజస్థాన్‌-కోస్తాంధ్ర మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందని…. హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అలాగే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూ­రు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -