టీడీపీ కుట్రలు మరోసారి భగ్నం అయ్యాయి. అధికారం ఉందని అడ్డదారిలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంటున్న టీడీపీ కూటమికి గట్టి షాక్ తగిలింది. ఆదోని ఛైర్‌పర్సన్ పదవి దక్కించుకోవాలని చివరి వరకు ప్రయత్నించిన టీడీపీకి నిరాశే మిగిలింది.
మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకు వ్యతిరేకంగా వైసీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. క శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో వైసీపీ నెగ్గింది.
ప్రలోభాలతో బీజేపీలో చేరిన 11, 12వ వార్డుల కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వై సీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ గెలుపొందింది. ఈ విజయం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి . అవిశ్వాసంలో విజయం సాధించిన కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వానికి బలం లేకున్నా, దౌర్జన్యంగా డబ్బులకు ప్రలోభ పెట్టి చైర్మన్ లు , వైస్ చైర్మన్ పదవులు గెలుస్తున్నారని, కర్నూల్ జిల్లా లో కూటమి నేతల పప్పులు ఉడకలేదన్నారు.