అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సులో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకుహైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు 28న జరిగే ‘అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు’కు ఆమె హాజరు కానున్నారు.
ఇవాంకా రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఆమె కోసం ప్రత్యేక బహుమతులు సిద్ధం చేయించింది టీ ప్రభుత్వం.తెలంగాణ చేనేత ప్రచారకర్త సమంత కూడా ఇవాంక కోసం ఓ బహుమతి సిద్ధం చేసినట్లు సమాచారం. ఏ బహుమతి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .
ఇవాంకాకు సమంత గొల్లభామ చీర ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. సమంత ఇటీవల సిద్ధిపేట వెళ్లి అక్కడ తనకు నచ్చిన కొన్ని చీరలు తీసుకొచ్చారట. వీటిలో తనకు బాగా నచ్చిన ఓ చీరను సమంత ఇవాంకకు ఇవ్వనున్నారట. ఇవాంక పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్‌లు, పచ్చదనంతో రోడ్లను చూడచక్కగా తయారు చేశారు. ఇవాంక ఇక్కడ రాకపోకల కోసం అమెరికా నుంచి కార్లు తెచ్చుకుంటున్నారు. ఆమెకు భోజనం తయారు చేయడానికి అక్కడి నుంచి 20 మంది వంటవాళ్లు కూడా వస్తున్నారు.