- Advertisement -
ఏపి ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఎంబిఎ అర్హతగా.. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తి చేయనుంది.
ఏపి డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హతలు: ఎంబిఎ/పిజి డిగ్రీ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సం.లు అనుభవం ఉండాలి.
జీతం: నెలకు 60,000 రూ.లు
ఎంపిక విధానం:
అర్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు:
ఆన్ లైన్లో వెబ్ సైట్ ద్వారా https://apsdpscareers.com/YP.aspx
ఈనెల 13/05/25 సాయంత్రం లోపు చేయాలి.
