ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదు అనే విషయం ఎన్ని సార్లు రుజువు అయినా మళ్ళీ మళ్ళీ అయితే గానీ మనోళ్ళకి బుద్ధి రావడం లేదు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బిల్లు మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది పార్లమెంటు సాక్షిగా చూసిన ప్రజలకి బీజేపీ తిప్పి కొట్టడం తో తీవ్ర నిరాశ మిగిలింది. రకరకాల కారణాలు చెప్పి బిల్లు ఓటింగ్ లో పెట్టడం కుదరదు అని తేల్చేసిన బీజేపీ ఇప్పుడు సైలెంట్ గా సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
అయితే జనాల చూపు ఇప్పటి వరకూ బీజేపీ మీద ఉండగా ఇప్పుడు తెలుగు దేశం మీద పడే అవకాశాలు కనిపిస్తునాయి. తెలుగు దేశం నేతలు ఎన్నో సార్లు ప్రత్యేక హోదా విషయం లో ప్రగల్భాలు పలికారు. డిల్లీ వెళ్ళిన ప్రతీ సారీ చంద్రబాబు ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు అనీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అనీ టీడీపీ నాయకులు తెహ్గా చెప్పుకొచ్చారు.
ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం ఫెయిల్ అయిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. భాజపా మిత్రపక్షమని తెలుగుదేశం ప్రచారం చేసుకోవడమే తప్ప… ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీసిన సందర్భం మచ్చుకైనా లేదు కదా! సో… ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రత్యేక హోదా రాదంటే… భాజపా ఇవ్వలేదన్న ప్రచారం కంటే, తెలుగుదేశం సాధించలేకపోయిందన్న అపవాదు ఆ పార్టీపై పడేట్టు ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు ముందుగానే గుర్తించినట్టు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే, ఎన్నడూ లేని విధంగాఇప్పుడు భాజపాపై విమర్శలు చేసేందుకు దేశం నేతల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.