అధికార పార్టీలో రేగిన నంద్యాల ఉప ఎన్నిక చిచ్చు చల్లారడం లేదు. రోజురోజుకూ సరికొత్త రూపంలో రగులుతూనే ఉంది.ఇప్పుడు తాజాగా మరో రచ్చమొదలయ్యింది.
నియోజకవర్గంలోని టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ అలకబూనారు.సమావేశానికి డుమ్మాకొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికను టీడీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.వైసీపీనుంచి గట్టిపోటీ ఎదురవడంతో ఎలాగైనాగెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు.అయితే ఇప్పుడు బాబు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారడంతోపాటు అఖిలను ఒంటరిదాన్ని చేశారు.
మంత్రి భూమా అఖిలప్రియ వల్ల నంద్యాల ఎన్నికల్లో ఉపయోగం లేదని భావించిన చంద్రబాబు.. ఆమెను పక్కన పెట్టారు. ఉప ఎన్నికల ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి ఆమెను తప్పించి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌కు అప్పగించారు.దీంతో అఖిల ప్రియతోపాటు,భూమా వర్గం నిర్ఘాంతపోయింది.తండ్రి ప్రాతినిథ్యం వహించిన స్థానంలో బాధ్యతలు వేరే వాల్లకు అప్పగించడంపై అఖిల కస్సుబుస్సుమంటున్నారు.
{loadmodule mod_custom,GA1}
భూమా అఖిలప్రియతో కలిసి పనిచేసేందుకు భూమా ముఖ్యఅనుచరుడు ఏవీ సుబ్బారెడ్డితోపాటు ఇతర నేతలుకూడా సుముఖంగాలేరు.ఈ పరిణామం జరిగినప్పటి నుంచి భూమా అఖిలప్రియ పెద్దగా కనిపించడం లేదు. బుధవారం నంద్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశానికి కూడా ఆమె హాజరుకాకపోవడంతో ఆమె అసంతృప్తి బహిర్గతం అయింది.
వాస్తవానికి నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి ఇద్దామనే విషయంపై కుటుంబంలోనే విభేదాలొచ్చాయి. తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె నాగమౌనిక కోరుకున్నారు. అయితే, బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని అఖిల పట్టుబట్టింది. అనుకున్నట్టుగానే ఆయనకు టికెట్ ఇప్పించుకున్నారు.ఇప్పుడు అందరూ కలసి అఖిలను ఒంటరిదాన్ని చేశారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- నంద్యాలలో టీడీపీ అభ్యర్తి బ్రహ్మానందరెడ్డి ఎవరో తెలియదు….
- టికెట్కోసమే శిల్పా పార్టీ మారితే… మరి మంత్రిపదవికోసమే అఖిల టీడీపీలో చేరారా..?
- పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాలని సూచన….
- తమ అక్కను టీడీపీ స్వార్థానికి వాడుకుంటోంది…
{youtube}ATewcgg0SMg{/youtube}