Tuesday, May 6, 2025
- Advertisement -

కేసీఆర్ కు ఏపీ రైతుల ప్రశంస!

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు ఏపీ రైతుల నుంచి రైతు సంఘాల నుంచి ప్రశంసలు దక్కాయి!

కేసీఆర్ పనితీరును అక్కడి రైతులు మెచ్చుకొంటున్నారు. ఈ మేరకు ఏపీ రైతు సంఘం ఒక ప్రకటన విడుదల చేసి మరీ కేసీఆర్ ను మెచ్చుకొంది. మరి ఉప్పు, నిప్పుల్లాంటి ఆంధ్రా తెలంగాణల మధ్య ఈ మెచ్చుగోలు ఏమిటి.. అంటే.. ఇది మిషన్ కాకతీయకు సంబంధించిన వ్యవహారం.

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం అభినందించింది. ఈ కార్యక్రమంతో చెరువుల మరమ్మతు చేపట్టడం నిజంగా గ్రేటు అని రైతులు అంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ ను మెచ్చుకొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని  ప్రవేశపెట్టి రాయలసీమలోని రైతులను బాగు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. 

అలాగే ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి గురించి కూడా ఏపీ ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చస్త్రశారు. మరి కేసీఆర్ కన్నా తాను ఎంతో గొప్ప వాడిని అని.. తనే అనుభవం ఉన్న పాలకుడిని అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పుకొంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ రైతుల నుంచి కేసీఆర్ కు ప్రశంసలు దక్కడం విశేషమే కదా.. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏమంటారో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -