వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసు తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు సమయం, తేదీపై కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్‌లో సమాచారం తప్పని తేల్చింది హైకోర్టు. నవంబర్ 8, 2024న అరెస్టు చేసి, నవంబర్ 10న అరెస్టుచేశామని ఎలా చెప్తారని మండిపడ్డారు న్యాయమూర్తి. బాధ్యులైన అధికారులు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది హైకోర్టు. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని జైలుకు పంపుతున్నారు. కావాలనే కొంతమందిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు…పోలీసులకు చీవాట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.