- Advertisement -
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పవన్, జగన్‌లై విమర్శలు చేశారు. రాష్ట్రవిభజన హామీలపై కేంద్రం కోర్టులో వేసిన అఫిడవిట్లపై ఇద్దరూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలపై నోరు మెదపడం లేదని.. ఏపీకి వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎందుకు మాట్లారని నిలదీశారు.
జగన్, పవన్‌లను ప్రధాని మోదీ ఏం మాయ చేశారో చెప్పాలన్నారు. ప్రజల సమస్యలంటే వాళ్లిద్దరికి అసలు పట్టవని.. వారి దృష్టి మొత్తం సీఎం కుర్చీపైనే ఉందని విమర్శించారు. మాట తప్పను.. మడమ తిప్పమని చెప్పే వైసీపీ.. నియోజకవర్గానికో మాట, జిల్లాకో వైఖరితో ఉందన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడంలో జగన్‌కు ఎవరూ సాటిలేరని యనమల విమర్శించారు. కాపుల రిజర్వేషన్లు, రుణమాఫీ విషయంలో జగన్ మాటపై నిలకడ లేదని మండిపడ్డారు.