వైరల్ ఇన్ఫెక్షన్స్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వాతావరణంలో మార్పులు సంభవించడంతో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు ప్రజలు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు,జీవన శైలిలో మార్పులు, కలుషిత నీరు,ఆరోగ్యం పై దృష్టి సారిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉంటామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా డెంగ్యూ , చికున్‌గున్యా, ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ, టైఫాయిడ్‌ , హెపటైటిస్‌ ఎ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ బారిన పడితే ఒళ్లు నొప్పులు, జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, గొంతునొప్పి,జలుబు వంటి లక్షణాలు ఉంటాయి.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వ్యాధుల బారిన పడటాన్ని అధిగమించవచ్చు. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. వీలైనంతగా బయట ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. గొంతు నొప్పి వస్తే ఖచ్చితంగా వైరస్‌లే కారణం. కాబట్టి గోరువెచ్చటి నీటిలో చిటెకెడు ఉప్పు వేసుకొని తరుచుగా పుకిలిస్తే రిలీఫ్‌గా ఉంటుంది. తరచూ చేతులు కడుక్కొని, వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలి.