బోయపాటి శ్రీను అంటే మాస్ మాసాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి. సింహా,లెంజెడ్,సరైన్నోడు సినిమాలు బోయపాటిని మాస్ డైరెక్టర్‌గా మార్చాయి. అయితే ఇన్ని హిట్లు ఇచ్చిన బోయపాటి ఒక్క ప్లాప్‌తో కిందికి పడిపోయాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బోయపాటి తెరకెక్కించిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా ఏమంత బాలేదని చరణ్ అభిమానులు సైతం కామెంట్ చేయడం విశేషం. దీంతో బోయపాటి గ్రాఫ్ పడిపోయింది.
రామ్ చరణ్ సినిమా తరువాత బాలయ్యతో బోయపాటి తెరకెక్కించే సినిమాపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. బాలయ్యతో గతంలో రెండు సినిమాలు చేశాడు బోయపాటి. సింహా, లెజెండ్ సినిమాలు చేశాడు బోయపాటి. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే బాలయ్య కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న తరుణంలో ఆయనకు అదిరిపోయో రెండు హిట్లు ఇచ్చాడు బోయపాటి. రామ్ చరణ్ తరువాత బాలయ్యతో సినిమా చాలా జాగ్రత్తగా చేస్తాడనడంలో ఎటువంటి అనుమానం లేదు.కాని ఇండస్ట్రీలోని ఓ వర్గం మాత్రం బాలయ్యతో బోయపాటి సినిమాపై అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’