Saturday, May 3, 2025
- Advertisement -

గెలుపు నాదే..బాలినేని ధీమా!

- Advertisement -

ఒంగోలులో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..వైసీపీ రెండోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారం దక్కించుకుంటుందని తేల్చిచెప్పారు.

జిల్లాలో వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు…. రేపటి కౌంటింగ్ రోజు ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎగ్జిట్ పోల్ పై జాతీయ సర్వేలు ఇస్తున్న అంచనా రిపోర్టులు ఒక ఫేక్ అన్నారు. రోజుకొక రీతిలో తమ ఇష్టమొచ్చినట్లు సంఖ్యను మార్చి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

ఏపీ మరోసారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ మళ్లీ సీఎం అవుతారనడానికి సంకేతంగానే రెండు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -