Tuesday, May 6, 2025
- Advertisement -

మేం వ్యబిచారం వదిలేశాం.. మీరు ఓటు అమ్ముకోవడం వదల్లేరా..?

- Advertisement -

వంగపహాడ్ ఒక వీధిలో ఆలోచింపజేస్తున్న బ్యానర్లు….

ఓటు అమ్ముకోమంటున్న బిక్షగాళ్లు….

అడుక్కుంటాం..కాని ఓటు అమ్ముకోం..

మేం వ్యబిచారం వదిలేశాం.. మీరు ఓటు అమ్ముకోవడం వదల్లేరా..?

వ్యబిచారానికి చిరునామాగా నిలిచిన గ్రామం.. వంగపహాడ్. ఈ గ్రామంలో ఓ వాడలోని కొన్ని కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా అపఖ్యాతి చెందాయి. అలాంటి ఈ గ్రామంలో ఇప్పుడు చైతన్యం వెల్లువిరిసింది. వంశ పారంపర్యంగా వ్యబిచారానికి అలవాటుపడ్డ ఈ గ్రామంలోని ఓ వీధిలోని కొన్ని వ్యబిచార కుటుంబాలు వ్యబిచారానికి పూర్తిగా దూరమయ్యాయి. తాము మారడమే కాదు సమాజంలోనూ మార్పు రావాలన్న ఉన్నత లక్ష్యంతో పడుపు వ్రత్తిని వీడిన ఈ కుటుంబాలు ఓటుకు నోటు వద్దంటూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. “మేం వ్యబిచారం వదిలేశాం..మీరు ఓటు అమ్ముకోవడం వదల్లేరా..?” అంటూ వారి ఇంటి ముందు పెట్టిన బ్యానర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ గ్రామం పేరు వింటేనే చిన్నచూపుతో ఉండే ప్రజలు ఇప్పుడు వీరి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వంగపహాడ్ గ్రామస్తుల ప్రయత్నానికి పూర్తి మద్దతు తెలిపిన జ్వాల సంస్థ వారిని మనస్ఫూర్తిగా అభినందించింది.

వరంగల్ లోని ప్రముఖ భద్రకాళి ఆలయం, రైల్వే స్టేషన్, బస్టాండ్ ముందు అడుక్కునే బిక్షగాళ్లు సైతం ఓటుకు నోటు వద్దని కోరుతున్నారు. ఇందుకోసం వినూత్న పంథా అనుసరిస్తున్నారు. తాము అడుక్కునే చోట బ్యానర్లు ఓటును అమ్ముకోవద్దు అంటూ కోరుతున్నారు. వారు అడుక్కునే ప్రాంతంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఓటుకు నోటు వద్దంటూ వరంగల్ నగరంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అవినీతి వ్యతిరేక సంస్థ ద్వారా “జ్వాల” వీరికి మద్దతుగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -