- Advertisement -
రోజాను మేకప్‌తో రావద్దని జగన్ అన్నారా..? టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అవుననే అంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదంటూ రోజా చేసిన విమర్శలపై.. బోండా ఉమా ప్రతిదాడి చేశారు.
రోజా మేకప్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అల్టిమేటం చేయడం వల్లే రోజా మేకప్ లేకుండా వైసీపీ కార్యాలయానికి వెళుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోనూ ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఆమెదని.. ఇకపై రోజా జబర్దస్త్ సెట్‌కే పరిమితమని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా.. సభ్య సమాజం తలవంచుకునేలా బూతులు మాట్లాడిన రోజా.. మహిళపై తమ గౌరవాన్ని శంకించడం.. ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని బోండా ఉమా విమర్శించారు.