భవిష్యత్తు గురించి మాట్లాడను అంటూనే.. తనకు ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదని అంటున్నాడు బొత్స సత్యనారాయణ. తాజాగా వైకాపాలో చేరిన ఈ మాజీ పీసీసీ చీఫ్ తన రాజకీయ ప్రస్థానం గురించి స్పందిస్తూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశాడు.
తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదని ఆయన వ్యాఖ్యానించాడు! ఒకవైపు సత్తిబాబు వైకాపా తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడనున్నాడనే ప్రచారం జరగుతోంది.
మండలిలో ఆయన ప్రతిపక్ష నేత కానున్నాడని కూడా అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సత్తిబాబు తన తాజా ఇంటర్వ్యూలో తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమేలేదని స్పష్టం చేశాడు. తనకు ఆ ఆలోచనే లేదని ఆయన అంటున్నాడు. మండలి ఎన్నికల్లో సత్తిబాబు పోటీ చేస్తాడని.. మండలిలో వైకాపా తరపు ప్రతిపక్ష నేత కూడా అవుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే సత్తిబాబు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నాడు.
మరి జరిగిన ప్రచారానికి.. సత్తిబాబు మాటలకూ ఏ సంబంధం లేకుండా పోతోందిప్పుడు. కానీ సత్తిబాబు ఇదే మాటకు కట్టుబడి ఉంటాడా? ఎన్నికల్లో పోటీకి పూర్తిగా దూరంగా ఉంటాడా? అనేది సందేహమే. తనకైతే పోటీకి ఇంట్రస్టు లేదంటూ.. తర్వాత పార్టీ ఒత్తిడి మేరకే తను పోటీ చేశానని అంటూ కూడా సత్తిబాబు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.