అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఓ ఆడియో ఫంక్షన్‌లో మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యయి. మహిళలను కించపరిచేలా ఆయన మాటలున్నాయంటూ..
మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మరికొంత మంది పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులూ చేస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లోను, నిన్న అనంతపురంలోను బాలకృష్ణపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనూ మహిళా సంఘం నేతలు.. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఓ ప్రకటన ద్వారా క్షమాపణ చెప్పిన బాలకృష్ణ.. మహిళాదినోత్సవం రోజున అసెంబ్లీ వేదికగా మరోమారు మన్నింపు కోరారు. తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సరదాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అయినా.. బాలయ్యను కేసులు వెంటాడడం ఆగలేదు. ఈ వ్యవహారం ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.