Monday, May 5, 2025
- Advertisement -

కరువు, చంద్రబాబు కవల పిల్లలా..!

- Advertisement -

ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో కరువును తరిమికొడతాం.. అని అంటాడు. రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తాము.. కరువును పారద్రోలుతాం అని ఆయన ప్రకటనలు చేస్తూ ఉంటాడు.

అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు తమకు కరువు తప్పదని అంటున్నారు రాయలసీమ జనాలు. ఈ ఏడాది రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు నెలకొన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 

మామూలుగా అయితే పంటలు వేశాకా వరుణుడు మొహం చాటేసేవాడు. ఈ సారి మాత్రం అసలు పంటల సాగుకు కూడా వర్షాలు రాని పరిస్థితి నెలకొంది. జూన్ , జూలై, ఆగస్టులు పోతూ ఉన్నా.. వర్షాలు మాత్రం కురవలేదు. ఇక కురుస్తాయనే ఆశ కూడా లేదు. అయితే ఈ విధమైన కరువు వల్ల అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పంటల సాగుకు మాత్రమే కాదు.. ఆఖరికి పశువుల మేత కూడా కష్టం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇదంతా చూస్తుంటే పదేళ్ల కిందటి నాటి పరిస్థితులు గుర్తొస్తున్నాయని రాయలసీమ జనులు అంటున్నారు.

2003కు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేదని వారు అంటున్నారు. అప్పుడు కూడా దుర్భరమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. విశేషం ఏమిటంటే అప్పుడు కూడా ఏపీకి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఆయనే సీఎంగా ఉన్నాడు. ఈ ఏడాది భయంకరమైన కరువు తాండవిస్తోంది. ఇదంతా చంద్రబాబు పాదమహిమ అనే వాళ్లూ లేకపోలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి మరి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -