ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పుడు అందరి చూపు మంగళగిరినియోజక కర్గంపైనే. ఎందుకంటె ఇక్కడ నుంచి చంద్రబాబు కొడుకు లోకేష్ వైసీపీ అబ్యర్ధి ఆర్కే పై పోటీ చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం కొడుకే పోటీ చేస్తుండంతో ప్రాధాన్యత ఏర్పడింది. పొర పాటున ఇక్కడనుంచి లోకేష్ ఓడిపోతె అది ఆయన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడనుంది. అందుకే లోకేష్ గెలుపు కోసం బాబు తన సర్వశక్తులు ఒడ్డారు.
అయితే ఎన్నికల్లో కొడుకు గెలుపుకోసం బాబు అక్రమాలకు పాల్పడ్డారి వైసీపీ అభ్యర్ధి ఆర్కే ఆరోపించారు. కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. ఏపీలో అర్ధరాత్రి వరకూ ఓటింగ్ జరిగినా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందనీ, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని మే 23 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.