Wednesday, May 7, 2025
- Advertisement -

ఆకర్షణ మంత్రం లో రాటు దేలిన చంద్రబాబు !

- Advertisement -

ఆకర్షణ పాలిటిక్స్ కి కేరాఫ్ గా మారింది తెలంగాణా రాజకీయం. అక్కడ వారిని స్పూర్తిగా తీసుకుని ఏపీ లో కూడా అదే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పుడు శత్రువులని కూడా నెత్తిన పెటుకునే పనిలో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు లో ఆనం సోదరులని జేర్చుకున్న ఆయన మిగితా జిల్లాల్లో కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నారు.

నేతలతో చిరకాల విరోధం ఉన్న టీడీపీ నేతలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మెట్టు దిగి వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఆనం సోదరుల రాకను నెల్లూరు టీడీపీ నేతలు ఎంతగా వ్యతిరేకించినా కూడా చంద్రబాబు వినలేదు… ఎవరొచ్చినా సర్దుకుపోవాల్సిందేనని తేల్చిచెప్పేశారు. మిగతా జిల్లాల్లోనూ అదే సూత్రం పాటించాలని ఆయన అనుకుంటుండడంతో ఆయా జిల్లాల కీలక నేతలు కిమ్మనకుండా అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో స్పీకర్ కోడెల శివప్రసాద్ అక్కడ తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కాసు కృష్ణారెడ్డితో భేటీ కావడం ఇలాంటిదేనని అంటున్నారు. స్పీకర్ కోడెల తో కలిసి రాయపాటి కాసు కృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లి దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు. పైకి సాధారణ సమావేశం మాత్రమే అనిపించచ్చు కానీ దీని వెనక చాలా రాజకీయ సూత్రాలు మారే సత్తా ఉంది అంటున్నారు విశ్లేషకులు.

2014 లో పోటీ చేసి మరీ ఓడిపోయారు కాసు కృష్ణా రెడ్డి. ఆనం బ్రదర్స్ లాగానే ఈయన్ని కూడా పార్టీలోకి లాగాలి అనేది బాబు ఐడియా. ఆ బాధ్యత కోడెల కీ, రాయపాటి కీ అప్పజెప్పారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -