రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నామని ఇప్పటికే ప్రకటించాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పాడు.
వివిధ దేశాధినేతలను, దేశీయంగా ప్రతిపక్ష నేతలను కూడా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతమందిని పిలిచిన చంద్రబాబు ప్రభుత్వంఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను పిలుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ జనసేన అధినేతకు ఆహ్వాన పత్రిను ఇవ్వడం గురించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. పవన్ ను పిలుస్తున్నట్టుగా చెప్పడం లేదు. మరి పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకున్నాడా.. లేకపోతే మరిచిపోయాడా? అనేది సందేహంగా మారిందిప్పుడు. ప్రభుత్వం అయితే ఇంత వరకూ అధికారికంగా ప్రకటన చేయలేదు. పవన్ ను పిలుస్తున్నామని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఒకవేళ ప్రభుత్వం పవన్ ను పిలవకపోతే.. ఆయన ఏమో కానీ., ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతారు. చంద్రబాబుపై మండి పడతారు. ఒకవేళ పిలిస్తే పవన్ కల్యాణ్ వస్తాడా? అనేది సందేహమే. అయితే అందరినీ పిలవడం ప్రభుత్వ ధర్మం. మరి ధర్మాన్ని పాటిస్తారా లేదా.. అనేది దానిపై కొంత సమయంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.