Saturday, May 3, 2025
- Advertisement -

ఒక్కసారి డిసైడైతే…!

- Advertisement -

చదవడానికి సినిమా డైలాగ్ లా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు అచ్చం ఇలాగే ఉంది.ఒక్కసారి డిసైడైతే ఆయన మాట ఆయనే వినే పరిస్థితి లేదనేంతలా.. ఉద్యోగుల తరలింపు ప్రహసనం నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి ఉద్యోగులు విజయవాడ, గుంటూరు వచ్చేయాలని వీలు దొరికినప్పుడల్లా సీఎం చెప్పడానికి చాలా కారణాలే ఉన్నట్టు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. 

వచ్చే ఏడాది జూన్ 2 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండేళ్లు పూర్తవుతుంది. అంటే.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో ఎనిమిదేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అయినా ఉద్యోగులు కచ్చితంగా హైదరాబాద్ వదిలి అమరావతికి రావాల్సిందే కాబట్టి.. ముందుగానే ఏపీకి వచ్చి పని చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు.. ప్రజా సమస్యల పరిష్కారానికి  సులువుగా ఉంటుందని ఉద్యోగులకు బాబు సర్కార్ నచ్చజెపుతున్నట్టు తెలుస్తోంది.

ఇక.. ప్రభుత్వ ఉద్యోగులను తన దారికి తెచ్చుకునేందుకు వీలైన అన్ని ప్రయోగాలు చేసేందుకు బాబు కసరత్తు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే 43 శాతం ఫిట్ మెంట్ తో ఉద్యోగ వర్గాల్లో పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసుకున్నారు. అదే టైమ్ లో.. నవ్యాంధ్ర నిర్మాణం కో్సం రోజుకు 2 గంటలు అదనంగా కూడా పని చేస్తామని ఉద్యోగులే డైరెక్ట్ గా చెప్పేలా చేశారు. ఆ హామీని ఇప్పుడు తీర్చమని ఇన్ డైరెక్ట్ గా ప్రెజర్ తెచ్చి.. అనుకున్న పని పూర్తి చేసేలా బాబు అడుగులు వేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వివాదాల తర్వాత.. ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్న బాబు.. ఉద్యోగులంతా ఏపీ నుంచి పని చేస్తేనే తన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా.. మిగతా విషయాలపై కంటే… రాజధాని నిర్మాణంతో పాటు.. ఉద్యోగులను హైదరాబాద్ నుంచి పూర్తిగా తరలించి.. ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే బాబు టార్గెట్ గా కనిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -