Tuesday, May 6, 2025
- Advertisement -

మోడీ ముందు బాబు ఒంగిపోతున్నాడా..!

- Advertisement -

ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు మోడీ ఒంగొన్నాడు.

బాబును విష్ చేయడానికి మోడీ సాగిల పడ్డట్టుగా కనిపించాడు. అయితే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మోడీ ముందు బాబు సాగిల పడుతున్న పరిస్థితి! ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. అనేక సార్లు బాబు, మోడీల సమావేశం సమయంలో.. బాబు పోజులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈయన ఎందుకు ఇలా ఒంగిపోతున్నాడు? అనే సందేహాలు తతెత్తుతున్నాయి.

ఆ మధ్య మోడీ విశాఖ వచ్చినప్పుడు కూడా బాబు ఇలాగే ఒంగాడో. ఒంగి మరీ మోడీకి నమస్కారం పెట్టాడు. తాజాగా ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా ఇదే సీనే రిపీటయ్యింది. తెలుగుదేశం అధినేత నరేంద్రమోడీ కి ఒంగి నమస్కారం పెట్టి.. పుష్పగుచ్ఛం అందించాడు. మరి ఇదంతా చూస్తుంటే… తెలుగుదేశం పార్టీ అధినేత బాబు మోడీ ముందు  సాగిపడుతున్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అయితే బాబు ఏం చేసినా రాష్ట్రం కోసమే చేశాడని ఆయన అభిమానులు సమర్థించుకొంటున్నారు.

అయినా అయినదానికీ కానిదానికీ ఢిల్లీకి వెళ్లడం… ఢిల్లీ పెద్దలకు దండాలు పెట్టడం.. వారి ముందు ఒంగడం అనేవి తెలుగుదేశం పార్టీ లక్షణాలు కావు. కాంగ్రెస్ నేతల్లో ఉన్న ఇలాంటి లక్షణాలను ఎన్టీఆర్ వ్యతిరేకించే సొంతంగా పార్టీ పెట్టారు. మరి ఇప్పుడు బాబు కూడా కాంగ్రెస్ నేతల్లాగానే ఇలా ఢిల్లీ ముందు సాగిలపడటం నిజంగా విడ్డూరమే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -