Monday, May 5, 2025
- Advertisement -

మీడియా సమావేశంలో వెల్లడించిన చంద్రబాబు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రావడం దాదాపు ఖాయమైంది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం సిఎం విలేకరులతో మాట్లాడుతూ లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అంశాన్ని వచ్చే క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు.

ఇలాంటి ప్రశ్నలకు ఎప్పుడు ముక్కుసూటిగా సమాధానం చెప్పే చంద్రబాబు ఈసారి నర్మగర్భంగా చెప్పడంతో లోకేష్ రాక దాదాపు ఖరారైందని అంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఎండల తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు 25 కోట్లు కేటాయించడం వంటి అంశాలపై చర్చించామని చంద్రబాబు చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్నందు వల్ల ఎవరూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -