Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్రబాబు.. అలా అందరికీ డబ్బులిచ్చేస్తాడా..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అడిగిన వారికి కాదనకుండా డబ్బులిస్తారా? లక్షల రూపాయలు అయినా ఇచ్చేస్తారా? ఇళ్లుకట్టుకోవాలంటే.. పార్టీ కి విశ్వాసపాత్రులైన నేతలకు లక్షలకు లక్షలు ధారపోస్తారా.. మహానాడులోని సీన్లను చూస్తుంటే కలిగే అనుమానం ఇది!

మహానాడు వేదికగా తెలుగుదేశం నేతలు మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇంద్రుడు.. చంద్రుడు.. వీరుడు.. శూరుడు.. అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్న తెలుగుదేశం నేతలు ఆయనతో తమ పర్సనల్ అనుభవాలను కూడా వివరించుకొంటున్నారు. బాబు ఎంత మంచివాడో చెప్పడానికి వారు ఒక్కొక్కరిగా ఒక్కో సంఘటనను వివరిస్తున్నారు. ఇలాంటి సంఘటనల్లో ఒకటి శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఒకటి వివరించారు.

తను పేదవాడిని అని పీఆర్ మోహన్ చెప్పుకొన్నారు. అయితే తను తెలుగుదేశం పార్టీకి విదేయుడిని అని.. పార్టీ పట్ల తన విశ్వసనీయత గురించి బాబు కు కూడా తెలుసని ఆయన అన్నాడు. ఇదే సమయంలోగతాన్ని ప్రస్తావించాడు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఇళ్లు కట్టుకొంటున్నట్టుగా బాబుకు వివరించానని మోహన్ అన్నారు. కొంతకాలం గడిచాకా..బాబు ఒకసారి ఇంటికి పిలిచి.. పాతిక లక్షల రూపాయలు ఇచ్చాడని, ఇల్లుకట్టుకోవడానికి ఆ సాయాన్ని చేశాడని  మోహన్ అన్నారు.

అయితే తను ఆ డబ్బు తీసుకోలేదని.. బాబుకు కృతజ్ఞతలు చెప్పి వచ్చేశానని ఈ చంద్రబాబు భక్తుడు వివరించాడు. మరి ఇది అనేక మంది తెలుగుదేశం నేతలు, కార్యకర్తల్లో ఆలోచన రేపి ఉండవచ్చు. బాబు అలా ఇళ్లను కట్టుకోవడానికి డబ్బు ఇస్తాడని అర్థం చేసుకొన్నవారిలో కొత్త ఆశలు పుట్టడం కూడా విశేషం కాదు కదా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -