Saturday, May 3, 2025
- Advertisement -

‘ఓటుకు నోటు ‘ కి ముందొక లెక్క తరవాత ఒక లెక్క – బాబు గారి వ్యూహం ?

- Advertisement -

తెరాస లీడర్, మంత్రి  నాయని నరసింహా రెడ్డి ఒక భారీ వ్యాఖ్య చేసారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తాడా.. చూస్తాం.. అన్నారు ఆయన. ఇది తీవ్ర హెచ్చరిక అనే చెప్పాలి. తెలుగు దేశం అధినేత చంద్రబాబు జీ హెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం పెద్ద విశేషమే అనిపిస్తోంది . బాబు ఇప్పుడు ఆ ఆలోచన కూడా చెయ్యట్లేదు అట. 

ఈ విషయంలో మీడియా అడుగుతున్నా ప్రశ్నలకి కూడా తెలుగు దేశం నేతలు బాబు వస్తారా రారా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ” మేము కోరుకుంటున్నాం ఆయన రావాలి అని, మేము అడిగాము కూడా ” అంటూ ఏవేవో నీళ్ళు నములుతూ చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. జీ హెచ్ ఎం సీ ఎన్నికల యొక్క ఆవశ్యకత ఒకరు చెబితే కానీ అధినేతకు తెలీదా ? కానీ ఓటుకు నోటు వ్యవహారం తరవాత బాబు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తోంది.

 మెదక్ ఉప ఎన్నికల సమయంలో వచ్చిన బాబు వరంగల్ లో బీజేపీ కి టికెట్ ఇచ్చేసి తమకేమీ ఒద్దు అన్నట్టు సైలెంట్ అయిపోవడం బాబు గారి బలహీనతని చూపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓటుకు నోటు కేసుకి ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారు బాబు అనేది అందరి మాటా.  ఈ ఒక్క కేసు ధాటికి బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తెరాసకు తాకట్టు పెట్టేసినట్టుగా వ్యవహరిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  ఇలాంటి వార్తలు పెల్లుబికితున్న నేపధ్యం లో బాబు గారు స్వయంగా రాబోయేఎన్నికలకి రాకపోతే మాత్రం పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -