మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యం కారణంగా సర్జరీ చేయించుకున్నారు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో భుజానికి సర్జరీ చేయించుకున్నారు చిరు. ఐతే కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షలో ఉండగా ఆయన్ని పలకరించేందుకు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి దగ్గరకు వేళ్లారు.
అక్కడ ఉన్న పోలిసులు చిరుతో పాటు అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్నారు. ఇక్కడ మెగాస్టార్ చిరు భుజానికి కట్టుతో కనిపించారు. ఆపరేషన్ జరగడం వల్ల భుజంపై భారం పడకూడదు అని కట్టుతోనే బైటకు వచ్చారు. ఐతే ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వెళ్లిన చిరంజీవిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి చేతికి కట్టుతోనే విమానాశ్రయం బయట నేలపై కూర్చోని నిరసన తెలిపారు. సంఘీభావం తెలుపుదాం అని వస్తే ఇలా అడ్డుకోవడం తప్పు అని అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులతో చాలా సేపు వాగ్వాదం జరిగింది.